Breaking News

బ్యాంక్‌ హామీని మినహాయించండి!

Published on Fri, 07/12/2024 - 05:27

న్యూఢిల్లీ: రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ఫైనాన్షియల్‌ బ్యాంక్‌ గ్యారంటీ(ఎఫ్‌బీజీ) మినహాయించమంటూ టెలికం శాఖ(డాట్‌)ను అభ్యరి్థంచినట్లు తెలుస్తోంది. స్పెక్ట్రమ్‌ చెల్లింపులకుగాను 2025 సెపె్టంబర్‌లో అందించవలసిన రూ. 24,747 కోట్ల ఎఫ్‌బీజీని మినహాయించమని డాట్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

స్పెక్ట్రమ్‌ వేలం నిబంధనల ప్రకారం వార్షికంగా చెల్లించవలసిన మొత్తాన్ని వొడాఫోన్‌ ఐడియా(వీఐఎల్‌) ఏడాది ముందుగానే సెక్యూరిటైజ్‌ చేయవలసి ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై వొడాఫోన్‌ ఐడియా స్పందించకపోవడం గమనార్హం! 2022కంటే ముందుగా నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కుగాను వీఐఎల్‌ చెల్లించవలసిన మొత్తమిది. 

అయితే 2022లో చెల్లింపులపై ప్రభు త్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా వీఐఎల్‌ నాలుగేళ్ల నిషేధాన్ని(మారటోరియం) వివియోగించుకుంది. ఫలితంగా 2016వరకూ నిర్వహించిన స్పెక్ట్రమ్‌ వేలం చెల్లింపులు 2025 అక్టోబర్‌– 2026 సెప్టెంబర్‌ మధ్యకాలంలో చేపట్టవలసి ఉంటుంది. మరోవైపు ఏజీఆర్‌ బకాయిల(చెల్లింపులు)పైనా మారటోరియాన్ని కంపెనీ వినియోగించుకుంది.

 ఇది 2026 మార్చిలో ముగియనుంది. దీంతో మారటోరియం ముగియడానికి కనీసం 13 నెలల ముందుగా వీఐఎల్‌ బ్యాంక్‌ గ్యారంటీలను సమరి్పంచవలసి ఉంటుంది. కాగా.. 2024 మార్చి31కల్లా కంపెనీ ప్రభుత్వానికి రూ. 2,03,430 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్‌ చెల్లింపులు రూ. 1,33,110 కోట్లుకాగా.. ఏజీఆర్‌ బకాయిలు రూ. 70,320 కోట్లు! మారటోరియాన్ని అందుకున్న సమయంలో కంపెనీ రూ. 16,000 కోట్ల వడ్డీ చెల్లింపులను ఈక్విటీ జారీ ద్వారా ప్రభుత్వానికి క్లియర్‌ చేసింది. తద్వారా కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించింది. తదుపరి కంపెనీ ఎఫ్‌పీవో ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించడంతో ప్రభుత్వ వాటా 23.8 శాతానికి పరిమితమైంది.  ఎన్‌ఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేరు ఫ్లాట్‌గా రూ. 16.62 వద్ద ముగిసింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)