Breaking News

ఉన్నదొకటి.. చెబుతున్నది ఇంకొకటి: ఐఐఎఫ్ఎల్ రిపోర్ట్

Published on Thu, 12/11/2025 - 18:07

భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాయి. వీఐ (వోడాఫోన్ ఐడియా), బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమదైన రీతిలో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా Vi యూజర్లలో ప్రతి ఐదు మందిలో ఒకరు కూడా యాక్టివ్‌గా లేరని ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో వెల్లడించింది.

ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో.. పేర్కొన్న విషయాలు, కంపెనీ చెబుతున్న విషయాలు చూస్తుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎలా అంటే.. Vi చెబుతున్న యూజర్లు 197.2 మిలియన్స్. కానీ నిజంగా యాక్టివ్‌గా ఉన్న యూజర్లు 154.7 మిలియన్స్ మాత్రమే. దీన్నిబట్టి చూస్తే.. కంపెనీ చెబుతున్న రిపోర్ట్ వేరు, వాస్తవంగా నెట్‌వర్క్‌లో ఉన్న యూజర్లు వేరు, అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో కూడా 2జీ నెంబర్ యూజర్లను తీసేస్తే.. 4జీ ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది.

యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ఏఆర్‌పీయూ) విషయానికి వస్తే.. కాగితంపై, Q2 FY26లో Vi ఏఆర్‌పీయూ రూ.167. ఇది ఎయిర్‌టెల్ (రూ. 256), జియో (రూ. 211.4) కంటే తక్కువ. కానీ నిజంగా Vi రీఛార్జ్ ప్లాన్ 209 రూపాయలు. అంతే కాకుండా Vi యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు కూడా నెలకు 746 నిముషాలు మాట్లాడినట్లు, ఇది ఎయిర్‌టెల్ (1071 నిముషాలు), జియో (1105 నిముషాలు)లతో పోలిస్తే చాలా తక్కువ.

సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను కూడా వోడాఫోన్ ఐడియా 20.83 లక్షలు కోల్పోయిందని ట్రాయ్ వెల్లడించింది. ఈ సమయంలో రిలయన్స్ జియో 2.7 మిలియన్ల 4G/5G వినియోగదారులను పొందగా.. భారతీ ఎయిర్‌టెల్ 2 మిలియన్లను పొందగలిగింది. మొత్తం మీద Vi ఉన్నదొకటైతే.. చెబుతున్నది మరొకటని స్పష్టంగా అర్థమవుతోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)