Breaking News

వొడాఫోన్‌ భారీ ఎఫ్‌పీవో

Published on Sat, 04/13/2024 - 05:01

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్‌–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్‌ 18–22 మధ్య ఎఫ్‌పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ.

కనీసం 1,298 షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్‌ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్‌ బ్యాంక్‌ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్‌ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్‌పీవో కానుంది. బ్రిటన్‌ టెలికం సంస్థ వొడాఫోన్‌ గ్రూప్‌ భారత్‌లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్‌తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్‌ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్‌–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది.  

జీక్యూజీ, ఎస్‌బీఐ ఎంఎఫ్‌ ఆసక్తి..
ఈ ఎఫ్‌పీవోలో దాదాపు 800 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్‌ చేయాలని జీక్యూజీ పార్ట్‌నర్స్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ రాజీవ్‌ జైన్‌ సారథ్యంలోని అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ 500 మిలియన్‌ డాలర్లు, ఎస్‌బీఐ మ్యుచువల్‌ ఫండ్‌ 200–300 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)