Breaking News

వివో నుంచి ప్రీమియం ఫోన్లు.. ‘జీస్‌’ ట్రిపుల్‌ కెమెరాతో..

Published on Sun, 02/22/2026 - 11:31

న్యూఢిల్లీ: వివో ఇండియా తన ‘వీ’ సిరీస్‌ నుంచి ‘వివో వీ70’, ‘వివో వీ70 ఎలైట్‌’ పేర్లతో రెండు ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ‘వివో’ ఈసారి కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘జీస్‌’ సంస్థతో ప్రతేక్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండు ఫోన్లలోనూ జీస్‌ పార్ట్‌నర్‌షిప్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది.

50 మెగా పిక్సెల్‌(ఎంపీ) ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ టెలి ఫొటోలెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. ఉత్తమ సెల్ఫీల కోసం ముందు భాగంలో  50 ఎంపీ జీస్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, రౌండెడ్‌ కార్నర్లతో ప్రీమియం లుక్‌ ఇచ్చారు. వీటికి ఐపీ68, ఐపీ69 రేటింగ్‌ ఉండడంతో నీరు, దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుకు, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తాయి.

ఈ రెండూ ఆండ్రాయిడ్‌ 16తో కూడిన ఆరిజన్‌ ఓఎస్‌6తో పనిచేస్తాయి. వీటికి ఆరేళ్ల సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ ప్రకటించింది. రెండు ఫోన్లలో భారీ 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్‌ లేదా 11 గంటల నావిగేషన్‌ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. హీట్‌ తగ్గించడానికి ‘బైపాస్‌ ఛార్జింగ్‌’ సౌకర్యం కూడా ఉంది.

వివో వీ70 
ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌4 ప్రాసెసర్‌ను అందించారు. రోజువారీ పనులు, గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.49,999కు లభిస్తుంది

వివో వీ70 ఎలైట్‌ 
ఇందులో శక్తివంతమైన క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌జెన్‌3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది గేమింగ్, అధిక పనితీరుకు అనువుగా ఉంటుంది. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.51,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.56,999, 12జీబీ+ 512 జీబీ వేరియంట్‌ ధర రూ.61,999గా నిర్ణయించింది.

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్‌ బ్యాంక్‌ కార్డులపై 10% వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. రూ.1,499 వివో ఇయర్‌ బడ్స్‌ ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఆన్‌లైన్‌ స్టోర్లలో లభిస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)