Breaking News

రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు

Published on Sun, 03/30/2025 - 18:17

కేవలం 33 సంవత్సరాల వయసులోనే.. 'వినయ్ హిరేమత్' (Vinay Hiremath).. లూమ్ కంపెనీ స్థాపించి, దానిని అట్లాసియన్‌ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ఆ తరువాత ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు. ఇప్పుడు అతడే రోజుకు 5 నుంచి 8 గంటలు ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) చదువుతూ.. ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

వినయ్ హిరేమత్ ఇప్పుడు మరొక స్టార్టప్‌ను ప్రారంభించడానికి బదులుగా, భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో తన సమయాన్ని పూర్తిగా గడుపుతున్నారు. పాడ్‌కాస్ట్ హోస్ట్ సామ్ పార్ ప్రకారం.. హిరేమత్ రోజుకు 5-8 గంటలు భౌతిక శాస్త్రాన్ని చదువుతున్నాడు, అంతే కాకుండా 18 ఏళ్ల వయస్సు గల డిస్కార్డ్ గ్రూపులలో తిరుగుతున్నాడు. మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ కావాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లూమ్‌ను విక్రయించిన తర్వాత అక్కడే ఉండాలా?, వద్దా?.. అనే దానితో హిరేమత్ కొంత సతమతమయ్యాడు. ఆ సమయంలోనే నేను ఆ కంపెనీలో పనిచేయడం సరైంది కాదని అనుకున్నాను. అయితే 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ) ప్యాకేజీని వదులుకోవడం కష్టంగానే అనిపించిందని గత మార్చిలోనే పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?

లూమ్‌ను విడిచిపెట్టిన కొన్ని రోజులకే.. హిరేమత్ పెట్టుబడిదారులను, రోబోటిక్స్ నిపుణులను కలిసి, రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించాలని భావించాడు. కానీ అది సాధ్యం కాదని తొందరగానే గ్రహించాను. నేను నిజంగా కోరుకునేది ఎలాన్ మస్క్ మాదిరిగా కనిపించడమేనని నాకు అర్థమైంది. కానీ అది చాలా భయంకరంగా ఉంది. క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌పై మస్క్, వివేక్ రామస్వామితో కలిసి నాలుగు వారాలు పనిచేసాను. ఆ అనుభవాలు వ్యాపార ఆవశ్యకతపై అవగాహనను మరింత పటిష్టం చేశాయి.

ప్రస్తుతం.. హిరేమత్ మరొక స్టార్టప్‌ను ప్రారంభించడం కంటే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ చేయాలనుకుంటున్నాను. దీంతో నేను ఏమి చేయాలో నాకు నిజంగా తెలియదని అన్నాడు. ఇప్పుడు ఏదైనా స్టార్టప్‌ స్టార్ట్ చేయడానికంటే.. చదువుకోవాలి అని నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)