Breaking News

సినిమా చూసి భావోద్వేగానికి గురైన సింఘానియా

Published on Thu, 12/12/2024 - 15:10

ప్రముఖ టెక్స్‌టైల్‌ కంపెనీ రేమండ్‌ సంస్థ మాజీ ఛైర్మన్‌, ఎండీగా వ్యవహరించిన విజయ్‌పథ్‌ సింఘానియా ఇటీవల ఓ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ‘వనవాస్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి విజయ్‌పథ్‌ సింఘానియా సినిమా చూశారు. ఈ చిత్రంలో కుటుంబ సభ్యుల ద్రోహం, మానవ విలువలు, ఆస్తుల పంపకాలు.. వంటి అంశాలు ప్రధానంగా ఉండబోతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలిసింది.

నటులు నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇందులో విజయ్‌పథ్‌ సింఘానియా జీవితాన్ని ప్రస్ఫుటించేలా సన్నివేశాలు ఉంటాయా..ఉండవా అనే విషయం మాత్రం సినిమా చూశాకే తెలుస్తుంది.

ఇదీ చదవండి: ఎయిరిండియా చెక్‌-ఇన్‌ సమయంలో మార్పులు

ఎవరీ విజయ్‌పత్ సింఘానియా?

మోస్ట్‌ పాపులర్‌ క్లాతింగ్‌ బ్రాండ్‌ రేమండ్స్  మాజీ ఛైర్మన్‌, ఎండీ విజయ్‌పత్ సింఘానియా. ప్రస్తుతం చేతిలో పైసాలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అలవోకగా నిర్వహించిన  బడా వ్యాపారవేత్త ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా ఇబ్బందిపడే పరిస్థితికి వెళ్లారు. 2015లో కుమారుడు గౌతమ్‌ సింఘానియాకు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. అనంతరం తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా  బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్‌ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)