Breaking News

చైర్మన్ పదవికి పేటీఎం బాస్ రాజీనామా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీరే

Published on Mon, 02/26/2024 - 21:44

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలతో సతమతమవుతున్న డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంస్థ ఫౌండర్ 'విజయ్ శేఖర్ శర్మ' తన వ్యాపారాన్ని ముగించడానికి ఇచ్చిన డేట్ ఇంకా పూర్తి కాకముందే తన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి స్వస్తి పలికారు.

ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కూడా పునర్నియమించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ సేఖ్రీ సిబల్ ఉన్నట్లు సమాచారం. కాగా కంపెనీ త్వరలోనే కొత్త చైర్మన్‌ను నియమించనున్నట్లు వెల్లడించింది.

కొత్త బోర్డు సభ్యుల నైపుణ్యం మా పాలనా నిర్మాణాలు, కార్యాచరణ ప్రమాణాలను పెంపొందించడంలో మాత్రమే కాకుండా.. మాకు మార్గనిర్దేశం చేయడంలో కూడా ఉపయోగపడుతుంద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ సురీందర్ చావ్లా తెలిపారు.

ఫిబ్రవరి 29 తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఫిన్‌టెక్ సంస్థను ఆదేశించింది, కానీ ప్రస్తుతం ఈ గడువు 2024 మార్చి 15 వరకు పొడిగించింది.

ఇదీ చదవండి: ఫుడ్ కోసం తగ్గిన ఖర్చు.. అంతా వాటికోసమే!.. సర్వేలో వెల్లడైన విషయాలు

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)