Breaking News

‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’

Published on Tue, 04/08/2025 - 07:44

న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులు తన ఆస్తులను అటాచ్‌ చేయడం ద్వారా తాను కట్టాల్సిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నాయని పరారీలో ఉన్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ చీఫ్‌ విజయ్‌ మాల్యా వ్యాఖ్యానించారు. ఇందుకు 2024–25 ఆర్థిక శాఖ వార్షిక నివేదికలోని గణాంకాలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో నేను రూ.6వేల కోట్లు బకాయి పడితే, భారతీయ బ్యాంకులు నా నుంచి రూ.14వేల కోట్లు వసూలు చేశాయి. ఇది నేను చెల్లించాల్సిన మొత్తం కంటే 2 రెట్లు ఎక్కువ’  అని విజయ్ మాల్యా అన్నారు. 

ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రాబట్టిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ, మాల్యా కేసులో రూ. 14,131.8 కోట్లు రికవర్‌ అయ్యిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ నివేదికలో పేర్కొన్నట్లు మాల్యా వివరించారు. డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ ఆదేశించిన రూ. 6,203 కోట్ల రికవరీకి ఇది రెట్టింపు మొత్తం అని ఆయన చెప్పారు. తనను భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్‌ కోర్టులో నడుస్తున్న కేసులో ఇది కీలక సాక్ష్యంగా ఉండబోతోందన్నారు.

బ్యాంకులు దీన్ని ఏ విధంగా కోర్టులో సమర్థించుకుంటాయో చూడాలని వ్యాఖ్యానించారు. వివిధ బ్యాంకులకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ. 9,000 కోట్లు బాకీపడిన కేసుకు సంబంధించి 2016 మార్చిలో మాల్యా బ్రిటన్‌కు పారిపోయారు. దీంతో మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణిస్తున్నారు. ఆయన్ను స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)