Breaking News

విజయ్‌ దేవరకొండ గ్యారేజీలో కాస్ట్‌లీ కార్లు..

Published on Sun, 04/02/2023 - 18:23

తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్‌గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

ఫోర్డ్ మస్టాంగ్:
ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ గత సంవత్సరం భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి:
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జిఎల్‌సి విజయ్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని యితడు ఇతర కార్లకంటే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్లలో లభిస్తుంది.

వోల్వో ఎక్స్‌సి 90:
విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు వోల్వో ఎక్స్‌సి 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం.

రేంజ్ రోవర్:
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్:
విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బిఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)