కడప స్టీల్ పై బాబు నాటకం
Breaking News
హీరో విడా KKR ఎడిషన్: దీని స్పెషాలిటీ ఏంటంటే?
Published on Thu, 03/26/2026 - 15:59
హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన విడా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తన భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0 ఈవెంట్‌లో VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ విడా కంటే భిన్నంగా నైట్ పర్పుల్, గోల్డ్ కలర్ పొందింది.
KKR సాధించిన మూడు ఛాంపియన్‌షిప్ విజయాలకు ప్రతీకగా మూడు యాక్సెంట్ మార్కులను ఈ బైకులో చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో కూడిన ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ముందు - వెనుక భాగాలలో ప్రత్యేకమైన ఎల్ఈడీ డీఆర్ఎల్ పొందుతుంది.
VX2 ప్లస్ KKR లిమిటెడ్ డిజైన్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో అదే 3.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 142 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఎంపిక చేసిన విడా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Tags : 1