Breaking News

వాహనాల తుక్కు ‘సింగిల్‌ విండో’లోకి  11 రాష్ట్రాలు

Published on Thu, 01/05/2023 - 11:34

న్యూఢిల్లీ: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఉద్దేశించిన ‘నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌’ పరిధిలోకి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రకటించింది. వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటుకు 2022 నవంబర్‌ 14 నాటికి 117 మంది ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది.

ఇందులో 36 దరఖాస్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఆంధప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, గోవా, ఉత్తరాఖండ్, చండీగఢ్‌ ఇందులో చేరాయి. 2022 ఏప్రిల్‌ 1 నుంచి వాహనాల తుక్కు విధానం అమల్లోకి రావడం గమనార్హం. ఇతర రాష్ట్రాలను కూడా ఇందులో త్వరగా భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 11 రాష్ట్రాల పరిధిలో 84 ఆటేమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలను రాష్ట్రాల నియంత్రణలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు పేర్కొంది.

చదవండి: iPhone 14: వావ్‌ ఐఫోన్‌ పై మరో క్రేజీ ఆఫర్‌! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)