Breaking News

ఆగస్టులో 3% పెరిగిన  వాహన విక్రయాలు

Published on Tue, 09/09/2025 - 05:52

న్యూఢిల్లీ: దేశీయ వాహన రిటైల్‌ విక్రయాలు ఆగస్టులో స్వల్పంగా 3% పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ( ఫాడా) గణాంకాలు వెల్లడించింది. మొత్తం ఆగస్టులో 19,64,547 వాహన రిజి్రస్టేషన్లు కాగా, 2024 ఆగస్టులో ఇవి 19,10,312గా ఉన్నాయని ఫాడా తెలిపింది. 

జీఎస్‌టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. ‘‘వేచి చూసే ధోరణి కారణంగా సెపె్టంబర్‌ ప్రథమార్థమంతా అమ్మకాలు అంతంత మాత్రమే ఉండొచ్చు. జీఎస్‌టీ విధానంపై స్పష్టత, పండుగ సెంటిమెంట్‌తో ఈ నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఉండొచ్చు’’ అని ఫాడా అంచనా వేసింది. 

→ ప్యాసింజర్‌ విక్రయాలు గతేడాది ఆగస్టుతో పోలిస్తే 3,20,291 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.93% పెరిగి 3,23,256 కు చేరాయి. మెరుగైన ఎంక్వైరీలు, పండుగ బుకింగ్స్‌తో ఆగస్టు ప్రథమార్థమంతా సానుకూల ధోరణి కని్పంచింది. అయితే ఆగస్టు 15న ప్రధాని జీఎస్‌టీ సంస్కరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారని ఫాడా తెలిపింది.  

→ ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 2.17% పెరిగాయి. ఈ ఆగస్టులో మొత్తం 13,73,675 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 13,44,380 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. ఓనమ్, గణేశ్‌ చతుర్థి పండుగ ప్రారంభంతో చాలా మంది కస్టమర్లు డెలివరీల కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు, వరదలు గ్రామీణ రాకపోకలకు అంతరాయంతో అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. 

→ వాణిజ్య వాహన రిటైల్‌ విక్రయాలు ఆగస్టులో 69,635 యూనిట్ల నుంచి 8.55% పెరిగి 75,592 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్‌ రిటైల్‌ అమ్మకాలు 1,05,493 యూనిట్ల నుంచి 2% తగ్గి 1,03,105కు దిగివచ్చాయి.  
 

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)