Breaking News

క్యూ1లో వేదాంతా దూకుడు

Published on Fri, 06/21/2024 - 06:28

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం వేదాంతా గ్రూప్‌ షేర్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో ఇటీవల దూకుడు చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి 28– జూన్‌ 20 మధ్య గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 2.2 లక్షల కోట్లు ఎగసింది. వెరసి మార్కెట్‌ విలువ వృద్ధి వేగంలో డైవర్సిఫైడ్‌ గ్రూప్‌ అదానీ, ఆటో దిగ్గజం ఎంఅండ్‌ఎం, కార్పొరేట్‌ దిగ్గజాలు టాటా గ్రూప్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)లను సైతం అధిగమించింది. 

ఈ కాలంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువకు రూ. 1.4 లక్షల కోట్లు చొప్పున జమయ్యింది. వేదాంతా గ్రూప్‌లోని హిందుస్తాన్‌ జింక్‌ షేరు ధర 52 వారాల కనిష్టం నుంచి రెట్టింపైంది. ఇందుకు విడదీత ప్రతిపాదన, రుణభార తగ్గింపుపై యాజమాన్య దృష్టి, మెరుగైన పనితీరు వంటి పలు సానుకూలతలు తోడ్పాటునిచ్చాయి.  ఇక ఈ కాలంలో టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ. 60,600 కోట్లమేర బలపడగా.. ఆర్‌ఐఎల్‌ విలువ రూ. 20,656 కోట్లమేర క్షీణించింది. 

రికార్డ్‌ రెవెన్యూ 
గతేడాది(2023–24) వేదాంతా గ్రూప్‌ రూ. 1,41,793 కోట్ల ఆదాయం సాధించింది. గ్రూప్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధికంకాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 36,455 కోట్లను తాకింది. 30 శాతం ఇబిటా మార్జిన్లను అందుకుంది. సమీప కాలంలో 10 బిలియన్‌ డాలర్ల ఇబిటాను సాధించేందుకు వేదాంతా గ్రూప్‌ ప్రణాళికలు అమలు చేస్తోంది. 

ఇందుకు వీలుగా జింక్, అల్యూమినియం, చమురు–గ్యాస్, విద్యుత్‌ తదితర బిజినెస్‌ల 50 ప్రభావవంత ప్రాజెక్టులను సమయానుగుణంగా పూర్తి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం గ్రూప్‌పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల వాటా 1.03 శాతం పెరిగి 8.77 శాతానికి చేరింది. దీంతో గత నెల 22న వేదాంతా షేరు రూ. 507 వద్ద, హింద్‌ జింక్‌ షేరు రూ. 807 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. బీఎస్‌ఈలో గురువారం వేదాంతా షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 470ను అధిగమించగా.. హింద్‌ జింక్‌ షేరు 2.3 శాతం బలపడి రూ. 648 వద్ద ముగిసింది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)