Breaking News

సైబర్ వలలో ప్రముఖ పారిశ్రామికవేత్త: రూ.7 కోట్లు మాయం

Published on Mon, 09/30/2024 - 11:10

వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్‌ను.. సైబర్ మోసగాళ్ల ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 7 కోట్లు మోసగించింది. దీనిని ఛేదిస్తూ పంజాబ్ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.

ఎస్పీ ఓస్వాల్‌ను మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. ముఠాలోని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు, వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని ఆయన తెలిపారు.

సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి డిజిటల్ అరెస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.

ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్

దేశంలో ఇలాంటి సైబర్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియనివారు ఫోన్ చేసి బెదిరించినా? డబ్బు డిమాండ్ చేసినా? సంబంధిత అధికారులకు వెంటనే వెల్లడించడం ఉత్తమం. లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)