Breaking News

స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు జగన్నాథన్‌ గుడ్‌బై

Published on Tue, 06/13/2023 - 06:36

చెన్నై: స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బోర్డ్‌కు వెంకటస్వామి జగన్నాథన్‌ రాజీనామా ప్రకటించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. 78 ఏళ్ల జగన్నాథన్‌ కంపెనీకి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్నారు. తక్షణం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జూన్‌ 10న జగన్నాథన్‌ నుంచి ఈ మెయిల్‌ వచ్చినట్టు స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది. జగన్నాథన్‌ను బీమా రంగం వెటరన్‌గా చెబుతారు. ప్రభుత్వరంగంలోని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌కు చైర్మన్, ఎండీగా పని చేసిన ఆయన, పదవీ విరమణ తర్వాత.. దుబాయికి చెందిన ఈటీఏ గ్రూప్‌ మద్దతుతో ప్రైవేటు రంగంలో స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ను స్థాపించారు.  

కొత్త బాట..
తన రాజీనామాపై జగన్నాథన్‌ స్పందించారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌కు రాజీనామా చేసినట్టు ధ్రువీకరించారు. ‘‘ప్రతీ ఆరంభానికి ముగింపు ఉంటుంది. అలాగే, ప్రతీ ముగింపునకు ఓ ఆరంభం ఉంటుందని నేను నమ్ముతాను. వచ్చే రెండు నెలల్లో ఏదో ఒకటి కొత్తగా ప్రారంభిస్తాను. అది ఏ రంగంలో అయినా ఉండొచ్చు. అది నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’’అని చెప్పారు. 12 మందితో ఆయన ప్రారంభించిన స్టార్‌ హెల్త్‌ నేడు రూ.30వేల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా అవతరించడం గమనార్హం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)