జీఎస్‌టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు!

Published on Sun, 06/21/2026 - 21:31

స్థిరంగా కొనసాగుతున్న డిమాండ్, జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో పెరిగిన కొనుగోలు సామర్థ్యం, యుటిలిటీ వాహనాలకు లభిస్తున్న ఆదరణ తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు 4–6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ‘ఇక్రా’ తన నివేదికలో తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ వాహనాల టోకు అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 27 శాతం వృద్ధితో 4.4 లక్షల యూనిట్లకు చేరాయి. అదే సమయంలో వినియోగదారుల నుంచి లభించిన భారీ డిమాండ్, కొత్త మోడళ్ల విడుదల, సుదీర్ఘ వివాహాల సీజన్‌ కారణంగా రిటైల్‌ విక్రయాలు 33 శాతం పెరిగాయి. అయితే, పెరుగుతున్న ఇంధన, కమొడిటీ ధరలతో పాటు బలహీనమైన రుతుపవనాలపై ఆందోళనలు రాబోయే కాలంలో నిశితంగా గమనించాల్సిన కీలక అంశాలుగా ఉన్నాయని ఇక్రా పేర్కొంది.

యుటిలిటీ వాహనాల ఆధిపత్యం 
‘‘ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల్లో ఇవి దాదాపు 68 శాతం వాటాను దక్కించుకున్నాయి. అలాగే, గత ఏడాది సెపె్టంబర్‌లో జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో మినీ, కాంపాక్ట్‌ కార్ల విభాగాల్లోనూ డిమాండ్‌ పుంజుకుంది’’ అని ఇక్రా నివేదిక స్పష్టం చేసింది.

పెరిగిన ఎగుమతులు.. ఈవీల జోరు
దేశీయ వాహన తయారీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ సరఫరాను ముమ్మరం చేయడంతో, ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగం కూడా పుంజుకుంది. 2027 ఆర్థిక సంవత్సర ఆరంభంలో ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో ఈవీల వాటా దాదాపు 6 శాతానికి చేరినట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)