Breaking News

ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?

Published on Sun, 12/29/2024 - 12:06

బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 'ఏటీఎం' (ATM) కార్డు (డెబిట్ కార్డు) ఉంటుంది. ఏటీఎం అనేది కేవలం డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఇతర కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్‌ కూడా తీసుకోవచ్చు.

ఫండ్ ట్రాన్స్‌ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.

క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.

బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్‌లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.

చెక్‌బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్‌లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్‌బుక్‌ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్‌బుక్‌ (Checkbook) వస్తుంది.

బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్‌వర్క్‌కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్‌సైట్‌లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.

మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.

ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)