Breaking News

మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!

Published on Sun, 04/13/2025 - 14:47

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చాలామంది సొంతంగా వాహనం కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కార్ల కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025 మొదటి త్రైమాసికంలో కార్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ విడుదల చేసింది.

స్పిన్నీ డేటా ప్రకారం.. 2025 మొదటి త్రైమాసికంలో ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్‌లో గణనీయమైన మార్పులను నివేదించింది. అమ్మకాలలో 77 శాతం డిజిటల్ లావాదేవీల ద్వారా జరుగుతున్నాయి. మహిళా కొనుగోలుదారుల సంఖ్య 28 శాతం పెరిగింది. మొదటిసారి కారు కొనుగోలు చేసినవారు 74 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ కార్ల అమ్మకాలు 29 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.

బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలు, పూణేలలో కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా బ్రాండ్ కార్లను అధికంగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. తెలుపు, బూడిద, ఎరుపు రంగు కార్లకే డిమాండ్ ఎక్కువని స్పిన్నీ స్పష్టం చేసింది.

డిజిటల్ లావాదేవీలు 2023లో 70 శాతం, 2024లో 75 శాతం ఉండగా 2025 మొదటి త్రైమాసికంలో 77 శాతానికి చేరింది. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న వారిలో 57 శాతం మంది లోన్ ద్వారానే కార్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మహిళా కొనుగోలుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024లో 26 శాతం మంది మహిళా కొనుగోలుదారులు ఉండగా.. 2025 నాటికి వీటి సంఖ్య 28 శాతానికి పెరిగింది.

ఇదీ చదవండి: భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఏదంటే..

60 శాతం మంది మహిళలు ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌లను ఇష్టపడుతుంటే.. 18 శాతం మంది కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. లోన్ ద్వారా కార్లను కొనుగోలుచేస్తున్న మహిళలు 27 శాతం ఉన్నారని నివేదికలో వెల్లడైంది.

రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి వాహనాలు అధిక ప్రజాదరణ పొందుతుండగా.. కాంపాక్ట్ SUVల విభాగంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ ఉన్నాయి. అమ్మకాల్లో 84 శాతం పెట్రోల్ కార్లు, 10 శాతం డీజిల్ కార్లు, 4 శాతం CNG కార్లు, 2 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. టాటా నిక్సన్ ఈవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ కూడా బాగా అభివృద్ధి చెందితోంది. అంటే కొనుగోలుదారుల్లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)