Breaking News

యూఎస్‌ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్‌

Published on Sat, 02/22/2025 - 09:55

అమెరికా తన రక్షణశాఖలో పనిచేస్తున్న 5,400 మంది సిబ్బందిని ఉద్యోగంలో నుంచి తొలగించబోతున్నట్లు తెలిపింది. అమెరికా పెంటగాన్‌(యూఎస్‌ డిఫెన్స్‌ ప్రధాన కార్యాలయం)లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సిబ్బంది సందర్శించి వచ్చే వారం నుంచి ప్రొబేషనరీ ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏడాది కంటే తక్కువ కాలం సర్వీసులో ఉన్నవారిపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది. దాంతోపాటు తదుపరి నియామకాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీఓజీఈ స్పష్టం చేసింది. యూఎస్‌ రక్షణశాఖ సామర్థ్యాన్ని పెంచడం, ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.

కొవ్వును తగ్గించి కండరాలు పెంచాలి..

అమెరికాలో మొత్తంగా ప్రభుత్వ అదీనంలోని శ్రామిక శక్తిని 5-8% తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. సామర్థ్యాలను పెంచడానికి, అధ్యక్షుడి ప్రాధాన్యతలపై డిపార్ట్‌మెంట్‌ దృష్టి సారించిందన్నారు. ఈ లేఆఫ్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. కొవ్వు(హెడ్‌ క్వార్టర్స్‌లోని సిబ్బంది)ను తగ్గించి కండరాలను (వార్‌ఫైటర్లు) పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ విభాగంలో ఉన్న వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య వల్ల కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి చర్యలపై కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అంతిమంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతలకు నిధులు సమకూర్చేందుకేనని అభిప్రాయపడుతున్నారు.

అతిపెద్ద అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ విభాగంలో 7,00,000 మందికి పైగా పూర్తికాల కార్మికులు పనిచేస్తున్నారు. ఫెడరల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రుణాల ముందస్తు ముగింపుపై ఛార్జీలొద్దు

పెంటగాన్

పెంటగాన్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం. వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌లో ఉన్న ఈ ఆఫీస్‌ 6.5 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ భవనాల్లో ఒకటిగా ఉంది. వీటిలో కేవలం 3.7 మిలియన్ చదరపు అడుగులను మాత్రమే కార్యాకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ భవనాన్ని యూఎస్ మిలిటరీకి చిహ్నంగా భావిస్తారు. ఇందులో సుమారు 23,000 మంది సైనిక, ఇతర ఉద్యోగులు, 3,000 మంది రక్షణేతర సహాయక సిబ్బంది పని చేస్తున్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)