Breaking News

గుడ్‌న్యూస్‌: కొత్త సేవలు వచ్చాయ్‌.. ఇలా చేస్తే ఇంట​ర్నెట్‌ లేకున్నా యూపీఐ పేమెంట్స్‌!

Published on Mon, 11/21/2022 - 11:17

టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకింగ్‌ వ్యవస్థలో చాలా మర్పులే వచ్చాయి. దీంతో కస్టమర్ల ఆర్థికపరమైన పనులన్నీ కూడా చిటికెలో అయిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా డిజిటెల్‌ చెల్లింపులు వైపు మొగ్గుచూపుతు​న్నారు. అయితే ఈ సేవలకు ఇంటర్నెట్‌ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ కాక చెల్లింపులు విషయంలో ఏ చిన్న నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తిన ఇబ్బందులు తప్పవన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు ఓ దారి దొరికింది.

నెట్‌వర్క్‌ లేకపోయినా యూపీఐ లావాదేవీలు..
ఇటీవల నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఈ లావాదేవీలు జరుపుతున్న సమయంలో నెట్‌వర్క్ సమస్యలు వస్తుంటాయి. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే కొత్త సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది మనలో చాలా మందికి తెలియదు.  భారతదేశంలోని బ్యాంకుల అంతటా యూపీఐ (UPI) సేవలను మరింత మెరుగపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) '*99# సేవ'ను ప్రారంభించింది. యూజర్లు చేయాల్సిందల్లా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా *99# డయల్ చేయడమే. 

ఇంటర్నెట్‌ లేకపోయినా పర్లేదు.. ఇలా చేయండి

► మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి.
► తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి.కొన్ని సందర్భాల్లో ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ అడుగుతుంది. దాని ప్రకారం, కోడ్‌ను ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.
► ఇది పూర్తికాగానే ఇలా కనిపిస్తుంది..

►1.Send Money
►2. Request Money
►3. Check Balance
►4. My Profile
►5. Pending Request
►6. Transactions
►7. UPI Pin

► పైన చూపిస్తున్న సేవలలో మీకు ఏది కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు నగదు ఇతరులకు పంపాలనుకుంటున్నారు.  డబ్బు పంపేందుకు 1 నంబర్‌ ఎంటర్‌ చేయండి.
► ఇప్పుడు మీరు ఏ ఖాతా నుంచి డబ్బు పంపాలనుకుంటున్నారో వివరాలను ఎంచుకోండి. ఇలా.. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారుని వివరాలు.. టైప్‌ చేసి (send)  ఎంటర్‌ చేయండి.
► మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకున్నట్లయితే, రిసీవర్ యూపీఐ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
► ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న మొత్తం నగదు ఎంటర్‌ చేసి పంపండి.
► ఆపై మీ యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి (send) ఆప్షన్‌ క్లిక్‌ చేయడంతో మీ లావాదేవీ ఇంటర్నెట్‌ లేకుండా పూర్తవుతుంది.

చదవండి: అసలే డిజిటలైజేషన్‌ డేస్‌.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం!

Videos

YS Jagan: వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం

మురళీ ఎక్కడ ఉన్నావ్.. జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ చెయ్

మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..

Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

శ్రీకాకుళం జిల్లా కొరాఠి ఫీల్డ్ అసిస్టెంట్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

సుప్రీంలో MP మిథున్‌రెడ్డికి ఊరట

పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాది హతం

పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదం నలుగురు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

బాగేపల్లి టోల్ గేట్ వద్ద వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

Photos

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)