Breaking News

యూపీఐ సరికొత్త రికార్డ్‌

Published on Sat, 08/02/2025 - 04:16

న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు జూలైలో సరికొత్త రికార్డులకు చేరాయి. 19.47 బిలియన్‌ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. వీటి విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది జూలైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.20.64 కోట్లతో పోల్చిచే 20 శాతానికి పైగా పెరిగింది. 

ఈ ఏడాది మే నెలలో నమోదైన 18.67 బిలియన్‌ లావాదేవీలు (విలువ రూ.25.14 లక్షల కోట్లు) ఇంతకుముందు వరకు గరిష్ట రికార్డుగా ఉంది. దేశంలోని మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు 85 శాతంగా ఉన్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్‌ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులోకి రావడం గమనార్హం.  

యూపీఐపై కొత్త పరిమితులు 
యూపీఐ నెట్‌వర్క్‌పై రద్దీని తగ్గించేందుకు వీలుగా ఎన్‌పీసీఐ కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. బ్యాంక్‌ ఖాతాలోఎంత బ్యాలన్స్‌ ఉందన్నది రోజులో 50 సార్ల వరకే పరిశీలించుకోగలరు. ఇంతకుముందు ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. యూపీఐ లింక్డ్‌ అకౌంట్లను సైతం 25 సార్లే  చూసుకోగలరు. ఒక మొబైల్‌ నంబర్‌కు లింక్‌ అయి, 12 నెలలకు పైగా ఇనాక్టివ్‌గా ఉన్న (కార్యకలాపాలు లేని) యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు.   
 

Videos

బైకును ఎత్తిండ్రు అన్నలు

నేషనల్ అవార్డుపై అనిల్ రావిపూడి ఫస్ట్ రియాక్షన్

సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?

ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..

దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు

నాపై కోపంతో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి

మీ పోరాటం రైతులకు ధైర్యం ఇస్తుంది.. అశోక్ బాబుని పరామర్శించిన పేర్ని నాని

విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్

చంద్రబాబు ఉన్నంతవరకు రైతులకు భరోసా లేదు: చంద్రబాబు

KSR Comment: లోకేష్ ఖబర్దార్.. ఇక కాచుకో.. YSRCP యాప్ రెడీ!

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)

+5

తెల్లజుట్టు.. మూడు కారణాలు..ఐదు పరిష్కారాలు (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

‘బేబీ’ మూవీ నేషనల్‌ అవార్డు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

బబ్లూ పృథ్వీరాజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గానే (ఫోటోలు)

+5

11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్‌లో నిహారిక (ఫోటోలు)

+5

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)