Breaking News

యూపీఐ ఆల్‌టైమ్ రికార్డ్: రూ. 94వేల కోట్లు!

Published on Thu, 10/23/2025 - 16:53

యూపీఐ (UPI) లావాదేవీలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. 2025 అక్టోబర్‌లో సగటు రోజువారీ లావాదేవీలు.. సెప్టెంబర్‌తో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.94,000 కోట్లకు చేరుకున్నట్లు 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) వెల్లడించింది.

2025 అక్టోబర్ 18న రూ.1.02 లక్షల కోట్ల విలువైన.. 75.4 కోట్ల యూపీఐ చెల్లింపులు జరిగాయి. ఇది ఒక రోజులో జరిగిన అత్యధిక లావాదేవీలు కావడం విశేషం. జీఎస్టీ సవరణ, ధంతేరాస్, దీపావళి వంటివి చెల్లింపులు పెరగడానికి దోహదపడ్డాయి. అక్టోబర్ నెల ముగియడానికి ఇంకా వారం రోజులు గడువు ఉండగానే లావాదేవీలు గరిష్టాలను తాకినట్లు స్పష్టమవుతోంది.

2025 అక్టోబర్ నెలలో ఇప్పటివరకు సగటున రోజుకు 69.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఇది 2025 సెప్టెంబర్ నెలతో (65.4 కోట్లు) పోలిస్తే 6 శాతం ఎక్కువ. అక్టోబర్ 20 నాటికి.. యూపీఐ రోజువారీ లావాదేవీల విలువ ఆరుసార్లు రూ. లక్ష కోట్లు దాటింది.

సాధారణంగా.. నెల ప్రారంభంలో జీతాలు & ఈఎంఐ చెల్లింపుల కారణంగా లావాదేవీలు ఎక్కువగానే ఉంటాయి. ఆ తరువాత ఖర్చు క్రమంగా తగ్గుతుంది. అయితే ఈ నెలలో పండుగలు రావడంతో.. లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దీంతో నెలవారీ లావాదేవీ విలువ మొదటిసారిగా రూ.28 లక్షల కోట్లు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపులలో.. 85 శాతం వాటా యూపీఐదే కావడం విశేషం.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)