Breaking News

UPI Transactions: రోజుకు రూ.67,165 కోట్లు

Published on Wed, 07/03/2024 - 11:18

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌లో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) హవా  కొనసాగుతోంది. యూపీఐ వేదికగా 2024 జూన్‌ నెలలో రోజుకు సగటున 46.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రోజుకు రూ.67,165 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రోజుకు 31.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రోజుకు రూ.49,182 కోట్లు. గత నెలలో (1–29 తేదీల మధ్య) రూ.19,47,787 కోట్ల విలువైన 1,342.3 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో రూ.14,75,464 కోట్ల విలువైన 933 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీనినిబట్టి చూస్తే యూపీఐ హవా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మొబైల్‌ ఫోన్‌ ద్వారా క్షణాల్లో, సురక్షితంగా చెల్లింపులు చేసే వీలుండడం వల్లే యూపీఐ ఈ స్థాయిలో దూసుకుపోతోంది. టెల్కోల దూకుడుతో మారుమూల పల్లెలకూ యూపీఐ యాప్స్‌ విస్తరించడం విశేషం.

598 సంస్థల సేవలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో 598 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సర్వీస్‌ ప్రొవైడర్లు నిమగ్నమయ్యాయి. యూపీఐ యాప్స్‌లో ఫోన్‌పే తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. యూపీఐ వేదికగా ఒక నెలలో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు సాధించిన తొలి యాప్‌గా ఫోన్‌పే సంచలనం సృష్టించింది. 2024 మే నెలలో ఫోన్‌పే ద్వారా ఏకంగా 683 కోట్ల లావాదేవీలు జరగగా, వీటి విలువ రూ.10,33,589 కోట్లు ఉంది. గూగుల్‌పే రూ.7,23,316 కోట్ల విలువైన 522 కోట్ల లావాదేవీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడవ స్థానంలో ఉన్న పేటీఎం యాప్‌ వేదికగా ఆర్‌బీఐ ఆంక్షల ప్రభావంతో లావాదేవీలు భారీగా క్షీణించాయి. మే నెలలో పేటీఎం ద్వారా రూ.1,24,705 కోట్ల విలువైన 114 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024 జనవరిలో పేటీఎం యాప్‌తో రూ.1,92,615 కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)