Breaking News

ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు

Published on Sat, 10/12/2024 - 08:48

తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీల సంఖ్య 2024 జనవరి–జూన్‌ మధ్య దేశవ్యాప్తంగా 78.97 బిలియన్ల(7897 కోట్లు)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీలు 52 శాతం పెరిగాయని పేమెంట్‌ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న వరల్డ్‌లైన్‌ నివేదిక వెల్లడించింది.

‘గతేడాదితో పోలిస్తే జనవరి–జూన్‌ మధ్య లావాదేవీల విలువ రూ.83.16 లక్షల కోట్లు నుంచి రూ.116.63 లక్షల కోట్లకు చేరింది. 2023 జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 803 కోట్లుగా ఉంది. 2024 జూన్‌కు ఇది 1300 కోట్లకు చేరింది. లావాదేవీల విలువ రూ.12.98 లక్షల కోట్ల నుంచి రూ.20.07 లక్షల కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వరుసగా మూడు స్థానాలను ఆక్రమించాయి. సగటు లావాదేవీ విలువ 2023 జనవరి–జూన్‌ మధ్య రూ.1,603 నమోదైంది. 2024 జూన్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఇది రూ.1,478కి చేరింది. ఆన్‌లైన్‌ పరిశ్రమలో ఈ–కామర్స్, గేమింగ్, యుటిలిటీస్, ప్రభుత్వ సేవలు, ఆర్థిక సేవలు మొత్తం లావాదేవీల పరిమాణంలో 81 శాతం, విలువలో 74 శాతం కైవసం చేసుకున్నాయి’ అని నివేదిక వివరించింది.

ఇదీ చదవండి: ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)