Breaking News

యూపీఐలో కీలక మార్పులు: సెప్టెంబర్ 15 నుంచి అమలు

Published on Mon, 09/08/2025 - 13:11

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన.. ఎంపిక చేసిన వర్గాలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీ పరిమితులను పెంచింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఎక్కువ లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం లభించింది. కొత్త పరిమితులు 2025 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.

యూపీఐ కొత్త పరిమితుల కింద.. వినియోగదారుడు 24 గంటల్లో 10 లక్షల వరకు లావాదేవీలను చేసుకోవచ్చు. ప్రత్యేక ధ్రువీకరణ పొందిన యూజర్లు.. వ్యాపార చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. కాగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి జరిగే లావాదేవీలలో ఎటువంటి మార్పు లేదు (రోజుకు రూ. లక్ష).

యూపీఐ పరిమితులలో కీలక మార్పులు
➤క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, బీమా చెల్లింపుల కోసం పరిమితులు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. అంతే కాకుండా 24 గంటల్లో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అనుమతి లభిస్తుంది.

➤ప్రయాణ రంగంలో.. లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెరిగింది. రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను ఇప్పుడు ఒకేసారి రూ. 5 లక్షల వరకు చేయవచ్చు. అయితే రోజువారీ పరిమితి రూ. 6 లక్షలకు పరిమితం చేశారు.

➤లోన్, ఈఎమ్ఐ పరిమితులు రూ. 5 లక్షలకు చేరాయి. గరిష్టంగా రోజుకు రూ. 10 లక్షల వరకు లావాదేవీ చేయవచ్చు. ఆభరణాల కొనుగోళ్లు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. రోజువారీ పరిమితి రూ. 6 లక్షలు.

➤బ్యాంకింగ్ సేవలలో, డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ద్వారా టర్మ్ డిపాజిట్‌లను రోజుకు రూ. 5 లక్షల వరకు అనుమతించారు. దీని పరిమితి గతంలో రూ. 2 లక్షలు మాత్రమే.

#

Tags : 1

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)