Breaking News

యూపీఐ ఎండీఆర్‌ ఛార్జీలు.. జనవరి 1కి వాయిదా?

Published on Thu, 10/08/2026 - 11:45

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలకు కొత్త మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) అమలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అది వాయిదా పడుతుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా కొత్త ఎండీఆర్‌ నిబంధనలు అక్టోబర్‌ 15 నుంచి అమలు కావాల్సి ఉంది. అయితే ఇది జనవరి 1, 2027కి వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తుది అధికారిక ప్రకటన వెలువడలేదని గమనించాలి.

కొత్త విధానం ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు(పీ2పీ) అన్ని ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే వ్యాపారులకు చేసే రూ.2,000 వరకు లావాదేవీలపైనా ఎండీఆర్‌ ఉండదు. చిన్న వ్యాపారులు నెలకు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా స్వీకరించే రూ.1 లక్ష వరకు చెల్లింపులకూ జీరో ఎండీఆర్‌ కొనసాగుతుంది. దీంతో మొత్తం పీర్‌2మర్చంట్‌ లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని కేంద్రం స్పష్టం చేసింది.

ఛార్జీలు ఇలా..

రూ.2,000కు మించిన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు రూ.5 ఫ్లాట్‌ ఎండీఆర్‌ను ప్రతిపాదించారు. మూలధన మార్కెట్‌ లావాదేవీలకు 0.02 శాతం, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.

ముఖ్యంగా ఎండీఆర్‌ వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐకి వెళ్లదు. చెల్లింపుల వ్యవస్థలోని బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, యూపీఐ యాప్‌ సంస్థల మధ్య పంపిణీ అవుతుంది. వినియోగదారులపై అదనపు భారం పడకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్‌ రేట్లు!

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)