Breaking News

పెరిగిన జీడీపీ వృద్ధి అంచనాలు

Published on Mon, 01/27/2025 - 13:53

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి  భారతదేశ నామమాత్ర జీడీపీ వృద్ధి 10.4%గా ప్రకటిస్తారని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 9.7 శాతం కంటే ఇది అధికం. వాస్తవ జీడీపీలో ఊహించిన ద్రవ్యోల్బణం నమోదు కావడమే ఈ పెరుగుదలకు కారణమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

నామమాత్రపు జీడీపీ వృద్ధిని నడిపించే అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల నామమాత్ర జీడీపీ వృద్ధికి గణనీయంగా దోహదం చేసే అవకాశం ఉంది. వినియోగాన్ని పునరుద్ధరించేందుకు సబ్సిడీల హేతుబద్ధీకరణ తోడ్పడుతుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: మహా కుంభమేళా ఎఫెక్ట్‌.. పెరిగిన ఛార్జీలు

2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.5% కంటే తక్కువగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి ఈ లక్ష్యం కీలకం కానుంది. జీడీపీలో వృద్ధి అంచనా వేసినప్పటికీ, ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. వాస్తవ జీడీపీ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 6.6% ఉంటుందని అంచనా. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించడం ఆర్థిక వృద్ధికి సానుకూల చర్యగా భావిస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)