Breaking News

600 కిమీ ప్రయాణించే కారు.. లాంచ్ ఎప్పుడంటే?

Published on Tue, 11/10/2026 - 11:08

పండుగ సీజన్ మొదలైందంటే.. కొత్త కార్ల సందడి ప్రారంభమవుతుంది. దేశీయ విఫణిలో ఇప్పటికే పలు కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. ఈ నెలలో (నవంబర్) మరికొన్ని కార్లు లాంచ్ కావడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

డెంజా జెడ్9 జీటీ
బీవైడీ కంపెనీ తన 'డెంజా జెడ్9 జీటీ'ను భారత మార్కెట్లో నవంబర్ 13న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో కనిపించిన ఈ కారు.. 600 కిమీ రేంజ్ అందించగల 122.5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది కేవలం .7 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అత్యాధునిక ఫీచర్స్ పొందనున్న ఈ కారు ధర రూ. 1.2 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్
టయోటా కంపెనీ నవంబర్ 25న ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనుంది. దీంతో ఇది భారతదేశంలో లాంచ్ కానున్న మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు అవుతుంది. ఇది ప్రస్తుత 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది, కానీ ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఏ ఇథనాల్ మిశ్రమాలకు మద్దతు ఇస్తుందో చూడాల్సి ఉంది. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

2026 మినీ కూపర్ ఎస్ఈ & పాల్ స్మిత్ ఎడిషన్
రెండవ తరం మినీ కూపర్ ఎస్ఈ & పాల్ స్మిత్ ఎడిషన్ నవంబర్ 27న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2023లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన రెండవ తరం కూపర్ ఎస్ఈ.. ఈ నెలలో భారతదేశంలో అమ్మకానికి రానుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేట్స్ పొందినట్లు సమాచారం.

స్పెషల్ పాల్ స్మిత్ ఎడిషన్ విషయానికి వస్తే.. బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ పాల్ స్మిత్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ ప్రత్యేక ఎడిషన్‌ను మూడు ప్రత్యేకమైన బాహ్య రంగులలో పొందవచ్చు. అవి స్టేట్‌మెంట్ గ్రే, ఇన్‌స్పైర్డ్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ మెటాలిక్. వీటిని నాటింగ్‌హామ్ గ్రీన్, జెట్ బ్లాక్ అనే రెండు రూఫ్ ఫినిషింగ్‌లలో పొందవచ్చు. ధర ఎంత?, డెలివరీలు ఎప్పుడు అనే విషయాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఇదీ చదవండి: అక్కడ మాత్రమే పెరిగిన గోల్డ్ రేటు!

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)