Breaking News

అక్టోబర్‌లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే..

Published on Tue, 09/24/2024 - 16:23

పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో కొరియన్ బ్రాండ్, చైనా బ్రాండ్, జర్మనీ బ్రాండ్స్ మొదలైనవి ఉన్నాయి. వచ్చే నెలలో (అక్టోబర్ 2024) లాంచ్ అయ్యే కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2024 కియా కార్నివాల్
కొత్త తరం కియా కార్నివాల్ 2023 అక్టోబర్ 3న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందనుంది. 2+2+3 సీటింగ్ లేఅవుట్‌తో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ కలిగి 193 పీఎస్ పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నట్లు సమాచారం.

కియా ఈవీ9
ఎప్పటి నుంచో లాంచ్‌కు సిద్దమవుతున్న కియా ఈవీ9 వచ్చే నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి కావడమనే తెలుస్తోంది.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్
భారతీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్.. అక్టోబర్ 4న ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అవుతుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. పరిమాణం పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, టెయిల్‌లైట్‌ మొదలైనవి ఉంటాయి.

బీవైడీ ఈమ్యాక్స్7
దేశీయ విఫణిలో అతి తక్కువ కాలంలోనేఅధిక ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్ బీవైడీ అక్టోబర్ 8న ఈమ్యాక్స్7పేరుతో ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మొదటి 1000 మంది కస్టమర్లకు రూ. 51000 విలువైన ప్రయోజనాలను అందించనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు

2024 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ ఎల్‌డబ్ల్యుబీ
మెర్సిడెస్ బెంజ్ తన 2024 ఈ క్లాస్ ఎల్‌డబ్ల్యుబీ కారును అక్టోబర్ 9న ఆవిష్కరించనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఎంపికలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికీ ఫ్రీ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి. ధర, వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)