Breaking News

రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్‌ రిపోర్ట్‌ ఎలా ఉందంటే..!

Published on Tue, 03/28/2023 - 04:08

న్యూఢిల్లీ: అఫర్డబుల్‌ ఇళ్లు (రూ. 40 లక్షల లోపు గృహాలు) సరఫరా గణనీయంగా తగ్గుతోంది. 2018 నుంచి గతేడాది వరకూ నాలుగేళ్ల వ్యవధిలో ఏడు ప్రధాన నగరాల్లో ఇది 20 శాతానికి పడిపోయింది. 2018లో ఇది 40 శాతంగా ఉండేది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ ఆవిష్కరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థలం ఖరీదుగా మారడం, లాభాల మార్జిన్లు తగ్గిపోవడం, తక్కువ వడ్డీ రేటుతో అవసరమై నంతగా రుణలభ్యత లేకపోవడం తదితర అంశాలు తాజా అఫర్డబుల్‌ ఇళ్ల సరఫరా పడిపోవడానికి కారణమని అనరాక్‌ పేర్కొంది.

2018లో ఏడు నగరాల్లో మొత్తం 1,95,300 గృహాల నిర్మాణం ప్రారంభం కాగా వాటిలో 40 శాతం అఫోర్డబుల్‌ కేటగిరీలో ఉన్నాయి. ఇది 2020లో 30 శాతానికి, 2021లో 26 శాతానికి, గతేడాది 20 శాతానికి తగ్గిపోయింది. ‘అఫర్డబుల్‌ ఇళ్ల విభాగం పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కారణాల్లో ఒకటి స్థలమే. మధ్య స్థాయి, ప్రీమియం ఇళ్లతో డెవలపర్లు సులభంగానే స్థలం ఖర్చులు రాబట్టుకోగలరు. (జాక్‌ మా రిటర్న్స్‌: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్‌ )

కానీ అఫర్డబుల్‌ ఇళ్ల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఇక ఈ ప్రాజెట్‌లకు  లాభాల మార్జిన్లు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. ముడి వనరుల ఖర్చులు (సిమెంటు, ఉక్కు, లేబర్‌ మొదలైనవి) పెరిగిపోయిన నేపథ్యంలో బడ్జెట్‌ ఇళ్ల నిర్మాణం మరింత కష్టంగా మారుతోంది‘ అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. డిమాండు రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు అపార్ట్‌మెంట్లకు డిమాండు ఉంటోందని ఆయన పేర్కొన్నారు.   (7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)