Breaking News

డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహకాలు తగ్గింపు

Published on Wed, 07/24/2024 - 14:54

రూపే డెబిట్ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారు. ఫిబ్రవరిలోని మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.3,500 కోట్లతో పోలిస్తే ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తికాల బడ్జెట్‌లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.

గత ఏడాది బడ్జెట్‌లో రూపే డెబిట్ కార్డులు, తక్కువ మొత్తంలో జరిగే బీహెచ్‌ఐఎం-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు యూనియన్ రూ.2,485 కోట్లును కేటాయించారు. ఫిబ్రవరి, 2024లో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లోనూ ఇందుకోసం రూ.3,500 కోట్లను ప్రతిపాదించారు. కానీ తాజా కేంద్ర పద్దుల లెక్కల్లో మాత్రం ఈ ప్రోత్సాహకాలను రూ.1,441 కోట్లకు తగ్గించారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?

బడ్జెట్‌లో కేంద్రం విడుదల చేసే డిజిటల్‌ పేమెంట్‌ ప్రోత్సాహక నిధులు ఫిన్‌టెక్, బ్యాంకింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని థర్డ్‌పార్టీ పేమెంట్‌ యాప్‌లు ఈ విభాగంలో ఆధిపత్యం సాగిస్తున్నాయని ఆర్‌బీఐ హెచ్చరించింది. ఆ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు ఇబ్బందులుపడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారతీయ వ్యాపారుల లావాదేవీలు 69 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరాణా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)