Breaking News

నిర్మాణ పరికరాల తయారీకి బూస్ట్‌ 

Published on Thu, 11/26/2026 - 04:20

న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మాణ, మౌలిక రంగ పరికరాల (సీఐఈ) తయారీని ప్రోత్సహించే దిశగా కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా రూ. 11,000 కోట్ల స్కీముకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 2026–27 నుంచి ఎనిమిదేళ్ల పాటు ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. 

2024–25 గణాంకాల ప్రకారం భారత సీఐఈ పరిశ్రమ రూ. 97,000 కోట్ల స్థాయిలో ఉన్నప్పటికీ దాదాపు 45 శాతం పరికరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అధునాతన సీఐఈ తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌ కీలక స్థానాన్ని దక్కించుకునేందుకు ఈ స్కీము ఉపయోగపడుతుందని వివరించారు. దీనితో పరిశ్రమ పరిమాణం 2029–30 నాటికి రెట్టింపై రూ. 2,28,100 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.  

భారీ పరిశ్రమల శాఖ అమలు చేసే ఈ పథకంలో భాగంగా తయారీ ప్లాంట్లను అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల వ్యవధి (2026–27 నుంచి 2027–28 వరకు), ఆ తర్వాత ఐదేళ్లు ప్రోత్సాహకాల వితరణ వ్యవధి ఉంటుంది. ఆఖరు సంవత్సరంలో (2032–33) అదనపు అమ్మకాలకు సంబంధించిన ప్రోత్సాహకాలను సెటిల్‌ చేస్తారు. పూర్తి స్థాయిలో లేదా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న ఏడు కేటగిరీల ఉత్పత్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 

ఇందులో టనల్‌ బోరింగ్‌ మెషీన్లు, ఆఫ్‌–హైవే ట్రక్కులు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు, డ్రిల్లింగ్‌ మెషీన్లు మొదలైనవి ఉంటాయి. స్కీము కింద దేశీయంగా అధునాతన సీఐఈ టెస్టింగ్‌ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. పథకంలో భాగంగా అమ్మకాల ఆధారిత ప్రోత్సాహకాలు, సీఐఈ టెస్టింగ్‌ యూనిట్‌కి రూ. 375 కోట్ల గ్రాంటు అందిస్తారు. విక్రయాల ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఐదేళ్ల పాటు 13 శాతం నుంచి 8 శాతం వరకు గ్రేడింగ్‌ ఇన్సెంటివ్‌ రేటు ఉంటుంది.  

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)