Breaking News

డిజిన్వెస్ట్‌మెంట్‌@రూ.47,000 కోట్లు

Published on Sun, 02/02/2025 - 09:29

కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.47,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రతిపాదించింది. అయితే డిజిన్వెస్ట్‌మెంట్, ఆస్తుల మానిటైజేషన్‌ తదితర మూలధన వసూళ్లకింద ఈ మొత్తాన్ని అంచనా వేసింది. వెరసి రూ.47,000 కోట్ల మిస్‌లేనియస్‌ క్యాపిటల్‌ రిసీప్ట్స్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వెరసి పీఎస్‌యూలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ(డిజిన్వెస్ట్‌మెంట్‌)ను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏడాది మూలధన సమీకరణగా పేర్కొంది.

2024–25లో ప్రభుత్వం వార్షిక డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాల నుంచి దూరం జరిగింది. పీఎస్‌యూలలో వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్‌ తదితర మిస్‌లేనియస్‌ క్యాపిటల్‌ రిసీప్ట్స్‌ ద్వారా రూ.50,000 కోట్ల లక్ష్యాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా ఎంఎస్‌టీసీ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీవోలకు దీపమ్‌ ప్రణాళికలు వేసింది. పీఎస్‌యూ దిగ్గజాలు హెచ్‌ఏఎల్, కోల్‌ ఇండియా, ఆర్‌వీఎన్‌ఎల్, ఎస్‌జేవీఎన్, హడ్కోలలో మైనారిటీ వాటాల విక్రయం(ఓఎఫ్‌ఎస్‌)ను సైతం చేపట్టింది. తద్వారా రూ. 13,728 కోట్లు సమకూర్చుకుంది. అయితే ఐడీబీఐ బ్యాంక్‌ ప్రయివేటైజేషన్‌సహా వ్యూహాత్మక వాటాల విక్రయం పట్టాలెక్కలేదు. 2021 అక్టోబర్‌లో టాటా గ్రూప్‌నకు విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయం తదుపరి ప్రధాన డీల్స్‌కు చెక్‌పడింది.

ఇదీ చదవండి: డివిడెండ్‌@రూ.2.56లక్షల కోట్లు

ద్రవ్యలోటు@రూ.15,68,936కోట్లు

ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం..ద్రవ్యలోటును 2024–25లో అనుకున్న ప్రకారం 4.8% వద్ద (జీడీపీ విలువలో) కేంద్రం కట్టడి చేయగలిగింది. విలువల్లో ఇది రూ.15,68,936 కోట్లు. 2025–26లో 4.4%కి తీసుకురావాలని నిర్దేశించుకుంది. గణాంకాల్లో చూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.15.70 లక్షల కోట్ల ద్రవ్యలోటు అంచనా వేయగా, అంతకన్నా తక్కువగా రూ.15.69 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. తాజా ద్రవ్యలోటును పూడ్చుకోడానికి  రూ.11.54 లక్షల కోట్ల మార్కెట్‌ రుణాన్ని సమీకరించాలని కొత్త బడ్జెట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన మొత్తాలను చిన్న తరహా పొదుపు మార్గాల ద్వారా సమీకరించాలని బడ్జెట్‌ నిర్దేశించింది. స్థూలంగా రూ.14.82 లక్షల కోట్ల మార్కెట్‌ రుణాలను స్వీకరించాలన్నది లక్ష్యం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)