Breaking News

బ్యాంకుల్లో అన్‌క్లైమ్డ్‌ డిపాజిట్లు రూ.78,213 కోట్లు

Published on Fri, 05/31/2024 - 05:57

బ్యాంకుల్లో అన్‌క్లైమ్డ్‌ డిపాజిట్ల విలువ 2024 మార్చితో గడచిన ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరింది. ఖాతాదారులు లేదా వారసుల కోసం ఒకవైపు ప్రయతి్నస్తూనే... మరోవైపు ఇలా ఎవ్వరూ క్లైమ్‌ చేయకుండా మిగిలిపోయిన మొత్తాలను డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎవేర్‌నెస్‌ ఫండ్‌లో (డీఈఏ) బదలాయించడం జరుగుతుంది. ఈ ఫండ్‌ ఇలాంటి నిధుల మొత్తం 2023 మార్చి నాటికి రూ.62,225 కోట్లు ఉంది. బ్యాంకులు 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా తమ ఖాతాలలో ఉన్న క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను ఆర్‌బీఐ పర్యవేక్షణలోని డీఈఏకు బదలాయిస్తాయి.  

⇒ భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని సమతౌల్యం చేసే సానుకూల పరిస్థితులూ ఉన్నాయి.  2022–23లో ఎకానమీ 7 శాతం పురోగమిస్తే, 2023–24లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదుకానుంది. 2024–25లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యే వీలుంది. తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్‌ తన హోదాను కొనసాగించనుంది. 

⇒ ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ 2024 మార్చి 31 నాటికి 11.08 శాతం వృద్ధితో రూ.70.48 లక్షల కోట్లకు చేరింది (దాదాపు 845 బిలియన్‌ డాలర్లు). పాకిస్తాన్‌ జీడీపీ 340 బిలియన్‌ డాలర్లకంటే ఇది 2.5 రెట్లు అధికం.  

⇒ అంతర్జాతీయంగా దేశీయ కరెన్సీ రూపీని మరింత చలామణీలోకి తేవడంలో భాగంగా భారత్‌ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు (పీఆర్‌వోఐ) విదేశాల్లోనూ రూపీ అకౌంట్లను 
తెరిచేందుకు అనుమతి.

⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది.  పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది.  2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ  విలువ  ప్రాతినిధ్యం వహిస్తోంది. 

⇒ బ్యాంకింగ్‌ రంగంలో మోసాల సంఖ్య మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా 13,564 నుంచి   36,075కు ఎగసింది. అయితే మోసాలకు సంబంధించిన విలువ మాత్రం 46.7 శాతం పడిపోయి రూ.13,930కోట్లకి చేరింది.  

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)