Breaking News

కేశోరామ్‌ విడదీత మార్చి1న

Published on Wed, 02/26/2025 - 04:06

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ సిమెంట్‌ రంగ దిగ్గజం అ్రల్టాటెక్‌ బోర్డు కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన సిమెంట్‌ బిజినెస్‌ విడదీతకు నిర్ణయించింది. దీంతో 2025 మార్చి1 నుంచి విడదీత పథకం అమలుకానున్నట్లు అ్రల్టాటెక్‌ సిమెంట్‌ పేర్కొంది. దీని ప్రకారం కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి సిమెంట్‌ బిజినెస్‌ను విడదీసి అ్రల్టాటెక్‌ సిమెంట్‌లో విలీనం చేస్తారు. మంగళవారం సమావేశమైన బోర్డు 1:52 నిష్పత్తిలో ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు అ్రల్టాటెక్‌ వెల్లడించింది. కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ 52 షేర్లకుగాను 1 అ్రల్టాటెక్‌ షేరును జారీ చేస్తారు.  కేశోరామ్‌ ప్రిఫరెన్స్‌ వాటాదారులకు 7.3 శాతంతో 54.86 లక్షల మార్పిడికి వీలుకాని రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల(ఎన్‌సీఆర్‌పీ)ను జారీ చేయనుంది.

90 లక్షల(5 శాతం) క్యుములేటివ్‌ ఎన్‌సీఆర్‌పీల స్థానే వీటిని కేటాయించనుంది. అంతేకాకుండా 19.19 లక్షల ఆప్షనల్లీ కన్వర్టిబుల్‌ రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల స్థానే  7.3 శాతంతో 8.64 లక్షల ఎన్‌సీఆర్‌పీలను జారీ చేయనుంది. ఈ పథకానికి 2023 నవంబర్‌ 30న రెండు కంపెనీల బోర్డులూ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆపై సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు సైతం లభించాయి.

కాగా.. సిమెంట్‌ బిజినెస్‌ విడదీత తదుపరి ట్రాన్స్‌పరెంట్‌ పేపర్, రేయాన్‌ విభాగాలతో కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మరోపక్క అ్రల్టాటెక్‌కు వార్షికంగా 7 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ తయారీ సామర్థ్యం జత కలవనుంది. ప్రస్తుత అ్రల్టాటెక్‌ సిమెంట్‌ తయారీ సామర్థ్యం వార్షికంగా 183 మిలియన్‌ టన్నులుకాగా.. సిమెంట్‌ తయారీలో చైనా వెలుపల ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు