Breaking News

ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ.. ఎందుకంటే..

Published on Fri, 03/22/2024 - 09:48

ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ తన ట్యాక్సీ డ్రైవర్లకు ఏకంగా రూ.1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఉబర్‌ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, అప్పటికే ఉబర్‌ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది.

ఉబర్‌ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్‌ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్‌ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు.

ఈ వ్యవహారంపై ఉబర్‌ స్పందిస్తూ ప్రపంచంలో కంపెనీ ఉబర్‌ సేవలు ప్రారంభించినపుడు ఆయా దేశాల్లో నియం​త్రణ నిబంధనలులేవు. ఆస్ట్రేలియాలో ఉబర్‌ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలు మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆదేశ నిబంధనల ప్రకారం..2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు.

ఇదీ చదవండి: మరో ‘కేజీఎఫ్‌’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)