Breaking News

స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌

Published on Fri, 08/30/2024 - 15:16

టూవీలర్ మార్కెటింగ్‌ పరిశ్రమ బలంగా పుంజుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి గిరాకీ పెరుగుతుందని, రుతుపవనాలు ఆశించిన మేర వస్తుండడంతో వ్యయ సామర్థ్యం పెరిగి వినియోగదారుల సంఖ్య అధికమవుతుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో స్కూటర్లకు డిమాండ్‌ హెచ్చవుతుందని తెలిపారు.

అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ..‘స్కూటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాలకు చెందినవారే టూవీలర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిశ్రమలో స్కూటర్‌ సెగ్మెంట్‌ 32 శాతం వాటాను కలిగి ఉంది. రుతుపవనాలు ఆశించినమేర వస్తుండడంతో వినియోగదారులు ద్విచక్రవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే పండుగ సీజన్‌లో విక్రయాలు పెరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వీటి అమ్మకాల్లో సుమారుగా 13 శాతం వృద్ధి నమోదైంది’ అన్నారు.

ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!

‘గతంలో బైక్‌ వాడిన యూజర్లు స్కూటర్‌ కొనుగోలు చేయాలంటే మైలేజీ, వాహన ఖరీదు వంటి అంశాలు అడ్డంకిగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మైలేజీతోపాటు అధునాతన టెక్నాలజీను అందిస్తున్నారు. టూవీలర్‌ అనేది ప్రస్తుతం సాధారణంగా అందరి వద్ద ఉండాల్సిన వస్తువుగా మారింది. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా రోడ్లను మెరుగుపరుస్తున్నాయి. దాంతో వీటిని మరింత సౌకర్యంగా నడిపే అవకాశం ఉంది’ అని తెలిపారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)