Breaking News

పండుగలకు జోరుగా టూ వీలర్ల అమ్మకాలు

Published on Sat, 08/31/2024 - 04:45

న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్‌ తిరిగి బలంగా పుంజుకోవడం, రుతుపవనాల పునరుద్ధరణ కారణంగా రాబోయే పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, కమ్యూటర్‌ బిజినెస్‌ హెడ్‌ అనిరుద్ధ హల్దార్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్లకు ఆదరణ పెరగడం ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని అన్నారు.

 మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం వాటా ప్రస్తుతం 32 శాతం ఉందని, ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీ కారణంగా స్కూటర్లు మెరుగైన మైలేజీ ఇవ్వడం కూడా కస్టమర్ల ఆసక్తికి కారణమైందని వివరించారు. అదనంగా స్థలం, సౌకర్యం, సౌలభ్యం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు మెరుగవడం కూడా స్కూటర్ల వినియోగం పెరిగేందుకు దోహదం చేసిందని చెప్పారు. అటు కుటుంబ సభ్యులు సైతం సౌకర్యంగా నడపవచ్చని అన్నారు.  

గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌.. 
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో టూ వీలర్స్‌ పరిశ్రమలో 13 శాతం వృద్ధిని చూశామని అనిరుద్ధ హల్దార్‌ తెలిపారు. ‘ఇది ఇటీవలి సంవత్సరాలలో మనం చూసిన దానికంటే ఎక్కువ. ఈమధ్య గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ పట్టణ ప్రాంతాలను మించిపోవడం మరింత సంతోషకరమైన విషయం. గ్రామీణ డిమాండ్‌ పట్టణ డిమాండ్‌ను అధిగమించడం ప్రారంభించినప్పుడు ఇది మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమకు చాలా మంచి సంకేతం. పండుగల సీజన్‌లో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమ ప్రస్తుత వృద్ధి రేటును అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. పరిశ్రమను మించిన వృద్ధిని టీవీఎస్‌ నమోదు చేస్తుందని నమ్మకంగా ఉంది’ అని హల్దార్‌ చెప్పారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)