Breaking News

టీవీఎస్ రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్‌ లాంచ్!

Published on Fri, 07/31/2026 - 15:45

టీవీఎస్ మోటార్ కంపెనీ రైడర్ 125 డాక్టర్ డూమ్ ఎడిషన్‌ను రూ.95,320 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేసింది. ఇప్పటికే ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, డెడ్‌పూల్, వోల్వరైన్ థీమ్‌లతో కూడిన మోటార్‌సైకిళ్లను కలిగి ఉన్న రైడర్ సూపర్ స్క్వాడ్ శ్రేణిని ఈ సరికొత్త మోడల్ మరింత విస్తరిస్తుంది. అంటే కొత్త థీమ్ కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని సంస్థ దీనిని విడుదల చేసింది.

డాక్టర్ డూమ్ ఎడిషన్ స్పెక్ట్రల్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌ పొందుతుంది. ఇది వివిధ లైటింగ్ పరిస్థితులలో ఆకుపచ్చ నుంచి గోధుమ రంగులోకి మారే కలర్ షిఫ్టింగ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే.. ఇతర సూపర్ స్క్వాడ్ రైడర్ మోడళ్ల మాదిరిగానే, దీని ఫ్యూయల్ ట్యాంక్ అండ్ సైడ్ ప్యానెళ్లపై కూడా డాక్టర్ డూమ్ గ్రాఫిక్స్ ఉంటాయి.

డిజైన్ పరంగా కొత్తగా అనిపించినప్పటికీ.. మెకానికల్‌గా ఏమీ మారలేదు. ఈ మోటార్‌సైకిల్ 124.8cc, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తూనే ఉంది. ఇది 11 bhp పవర్, 11.75 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

ఫీచర్ల జాబితాలో కూడా ఎలాంటి మార్పు లేదు. అయితే రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్‌లో.. కనెక్టెడ్ ఫంక్షన్లతో కూడిన టీవీఎస్ కనెక్టెడ్ రివర్స్ ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. టాప్ స్పెక్ సూపర్ స్క్వాడ్ వేరియంట్లలో సింగిల్ ఛానల్ ABSతో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. ఈ లేటెస్ట్ బైక్.. రానున్న రోజుల్లో అధీకృత టీవీఎస్ డీలర్‌షిప్‌లన్నింటిలో అందుబాటులోకి వస్తుంది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)