Breaking News

ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్‌..

Published on Tue, 01/21/2025 - 08:08

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల రంగంలోకి ప్రవేశించింది. ఎక్స్‌పోలో భాగంగా కింగ్‌ ఈవీ మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఇది భారత్‌లో బ్లూటూత్‌తో అనుసంధానించిన తొలి ఎలక్ట్రిక్‌ త్రీ–వీలర్‌. స్థిర సాంకేతికతతో పట్టణ మొబిలిటీని పెంచే లక్ష్యంతో దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. టీవీఎస్‌ స్మార్ట్‌కనెక్ట్‌తో తయారైంది. ఇది స్మార్ట్‌ఫోన్‌ ఇంటిగ్రేషన్‌ ద్వారా రియల్‌ టైమ్‌ నావిగేషన్, అలర్ట్స్, వాహన స్థితిగతులను తెలియజేస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టీవీఎస్‌ తెలిపింది. 3 గంటల 30 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్‌ పూర్తి అవుతుంది. 51.2 వోల్ట్‌ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. ఎక్స్‌ షోరూం  ధర రూ.2.95 లక్షలు.

ఇదీ చదవండి: టిక్‌టాక్‌ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..! 

మళ్లీ స్కోడా డీజిల్‌ కార్లు

వాహన తయారీలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ కంపెనీ స్కోడా అయిదేళ్ల తర్వాత భారత్‌లో డీజిల్‌ ఇంజన్స్‌ను మళ్లీ ప్రవేశపెడుతోంది. భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో వేదికగా సూపర్బ్‌ డీజిల్‌ కారును ప్రదర్శించింది. కొడియాక్‌ డీజిల్‌ సైతం త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతీయ కస్టమర్లు ఇప్పటికీ డీజిల్‌ కార్లను డిమాండ్‌ చేస్తున్నారని స్కోడా ఇండియా హెడ్‌ పీటర్‌ యానిబా తెలిపారు. ‘స్కోడా కార్ల విక్రయాల్లో గతంలో 80 శాతం యూనిట్లు డీజిల్‌ విభాగం కైవసం చేసుకుంది. హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా అమ్మకాల్లో గణనీయ భాగం డీజిల్‌ వాహనాలు సమకూరుస్తున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్, బీఎండబ్ల్యూలకు కూడా అంతే. కాబట్టి లగ్జరీ, ఎగ్జిక్యూటివ్‌ సెగ్మెంట్ల మధ్యలో ఉన్న స్కోడా ఈ మార్పు నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. మేము కచి్చతంగా డిమాండ్‌ను నెరవేర్చడానికి చూస్తున్నాం’ అని వివరించారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)