Breaking News

ఉత్పత్తిలో సరికొత్త రికార్డ్!.. కంపెనీ నుంచి మరో బైక్

Published on Sun, 11/30/2025 - 19:38

టీవీఎస్ మోటార్ కంపెనీ & బీఎండబ్ల్యూ మోటోరాడ్ తమ దీర్ఘకాల భాగస్వామ్యంలో రెండు లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. 2013లో ఇరు కంపెనీలు కలిసినప్పటి నుంచి సబ్ 500సీసీ విభాగంలో కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత జీ 310 ఆర్, జీ 310 జీఎస్, జీ 310 ఆర్ఆర్ మోడల్స్ పుట్టుకొచ్చాయి. ఇవి ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడయ్యాయి.

'బీఎండబ్ల్యూ మోటోరాడ్'తో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న మా భాగస్వామ్యంలో.. ఆవిష్కరణ & నాణ్యత భాగస్వామ్య విలువలు, విజయానికి పునాదిగా నిలిచాయి. మేము యూరప్, అమెరికా & ఆసియాలోని ప్రముఖ మార్కెట్లలోని అనేక కొత్త ఉత్పత్తులను రూపొందించామని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్ అండ్ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ అన్నారు.

రెండు లక్షల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. టీవీఎస్ హోసూర్ తయారీ కేంద్రం నుంచి బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ అడ్వెంచర్ బైక్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది రెండు కంపెనీల ప్రయాణానికి గొప్ప అధ్యాయం అని బీఎండబ్ల్యూ మోటోరాడ్ సీఈఓ మార్కస్ ఫ్లాష్ పేర్కొన్నారు.

బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్
బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ బైక్.. 420సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో 8,750 rpm వద్ద 48 bhp & 6,750 rpm వద్ద 43 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతుంది. బీఎండబ్ల్యూ బేస్ మోడల్ మినహా అన్నింటిలోనూ క్విక్‌షిఫ్టర్‌ను అందిస్తుంది, అయితే టాప్-స్పెక్ జీఎస్ ట్రోఫీ ఈజీ రైడ్ క్లచ్ సిస్టమ్‌ను పొందుతుంది.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)