Breaking News

టాప్‌లేపిన టీవీఎస్‌!

Published on Tue, 07/07/2026 - 01:43

దేశీ టూవీలర్‌ కంపెనీల మధ్య రేసు రసవత్తరంగా మారుతోంది. తొలిసారిగా టీవీఎస్‌ మోటార్స్‌ దేశంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన కంపెనీగా అవతరించడంతో పోటీ హీటెక్కింది. జూన్‌ నెల మొత్తం అమ్మకాల్లో దుమ్మురేపి.. హీరో మోటోకార్ప్‌ను వెనక్కినెట్టింది. ఎగుమతులు టాప్‌గేర్‌లో దూసుకెళ్లడం టీవీఎస్‌కు జోరుకు ప్రధాన కారణం. అయితే, దేశీ విక్రయాల్లో మాత్రం ఇప్పటికీ హవా ‘హీరో’దే కావడం విశేషం!

విదేశీ వ్యాపారం దూకుడుతో టీవీఎస్‌ మోటార్స్‌ చెలరేగిపోతోంది. గత నెలలో ఎగుమతులతో కలిపి కంపెనీ 5,65,417 ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే అమ్మకాలు 47 శాతం జంప్‌ చేశాయి. దేశీయంగా బైక్స్‌ అమ్మకాలు 42 శాతం (2,67,096) దూసుకెళ్లగా... స్కూటర్‌ సేల్స్‌ ఏకంగా 53 శాతం (2,47,950) పెరగడం గమనార్హం. దీంతో ఏళ్లకు ఏళ్లు మార్కెట్‌ లీడర్‌గా పాతుకుపోయిన హీరో మోటోకార్ప్‌ను రేసులో రెండో స్థానానికి తోసేసి.. టీవీఎస్‌ ‘టాప్‌’లేపింది. ఈ ఏడాది జూన్‌లో హీరో మోటో మొత్తం 5,41,519 టూవీలర్లను అమ్మింది.

హోండా మోటార్‌సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా 5,28,281 వాహనాలతో మూడో ప్లేస్‌లో నిలిచింది. అయితే, దేశీ మార్కెట్‌ రారాజు ఇప్పటికీ హీరో మోటోనే. జూన్‌లో ఈ కంపెనీ అమ్మకాలు 4.4 శాతం తగ్గినప్పటికీ.. 5 లక్షల పైనే వాహనాలను సేల్‌ చేసింది. అదేవిధంగా హోండా దేశీయంగా 4,68,956 టూవీలర్లను విక్రయించి (21% వృద్ధి) రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మోపెడ్‌ సేల్స్‌ను మినహాయంచి చూస్తే, దేశీయంగా 4,11,014 టూవీలర్లు సేల్‌ చేసిన టీవీఎస్‌ మూడో ప్లేసు దక్కించుకుంది. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ పేరుతో ప్రస్తుతం మోపెడ్‌ను ఈ ఒక్క కంపెనీ మాత్రమే అమ్ముతోంది. జూన్‌లో 50,371 (46% అప్‌) టీవీఎస్‌ మోపెడ్లు రోడ్డెక్కడం ఇంకా వీటికున్న ఆదరణకు అద్దంపడుతోంది.

ఎగుమతుల రైడ్‌... 
నంబర్‌ వన్‌ మైలురాయిని చేరుకోవడంలో టీవీఎస్‌కు దేశీ అమ్మకాల కంటే ఎగుమతులే దన్నుగా నిలిచాయి. విదేశీ విపణిలో ఈ చెన్నై కంపెనీ జూన్‌లో ఏకంగా 47 శాతం వృద్ధితో 1,72,355 టూవీలర్లను సేల్‌ చేసింది. తద్వారా హీరో మోటో, హోండాలను ఈజీగా దాటేసింది. ఈ రెండు కంపెనీలు కలిపి 97,594 యూనిట్లను ఎగుమతి చేయగా.. ఒక్క టీవీఎస్‌ దీనికి దాదాపు రెట్టింపు స్థాయిలో విదేశాల్లో విక్రయించడం విశేషం!  అయితే, టాప్‌ టూవీలర్‌ ఎగుమతిదారుగా మాత్రం బజాజ్‌ ఆటో నిలిచి టీవీఎస్‌కు షాకిచి్చంది. జూన్‌లో బజాజ్‌ ఆటో 2,22,439 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. గతేడాది జూన్‌తో పోలిస్తే బజాజ్‌ విదేశీ సేల్స్‌ 49 శాతం పెరిగాయి.

విదేశీ వృద్ధి ఇంజిన్‌... 
టీవీఎస్‌కు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వ్యాపారమే కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా మారుతోంది. కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం, 90కి పైగా దేశాల్లో టీవీఎస్‌ బైక్‌లు, స్కూటర్లు పరుగులు తీస్తున్నాయి. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలు పటిష్టమైన విదేశీ మార్కెట్లుగా నిలుస్తున్నాయి. తద్వారా టీవీఎస్‌ టూవీలర్‌ రంగంలో గ్లోబల్‌ కంపెనీగా ఎదుగుతోంది. వార్షిక అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టూవీలర్‌ తయారీదారుగా ఆవిర్భవించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో 25 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారానే లభించడం దీనికి నిదర్శనం.

ఎలక్ట్రిక్‌లోనూ టాప్‌ స్పీడ్‌...
ఎలక్ట్రిక్‌ టూవీలర్ల విభాగంలో కూడా టీవీఎస్‌ ఓ రేంజ్‌లో దుమ్మురేపుతోంది. జూన్‌లో ఏకంగా 48,537 ఈ–సూ్కటర్లను విక్రయించింది. దేశవ్యాప్తంగా 1,93,495 లక్షల ఈ–టూవీలర్లు అమ్ముడవగా.. టీవీఎస్‌ 24 శాతం పైగా మార్కెట్‌ వాటాతో టాప్‌లో నిలిచింది. తర్వాత స్థానాల్లో బజాజ్‌ (22%), ఏథర్‌(16%), హీరో విడా(11%) ఉన్నాయి. ఒకప్పుడు నంబర్‌ వన్‌లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ 8% వాటాతో ఐదో స్థానానికి పడిపోయింది. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)