Breaking News

ట్రూజెట్‌ మళ్లీ వస్తోంది.. 

Published on Fri, 06/13/2025 - 04:18

న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిలిపివేసిన ట్రూజెట్‌ (గతంలో టర్బో మేఘా ఎయిర్‌వేస్‌) మళ్లీ సర్వీసులను ప్రారంభించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇన్వెస్టర్ల దన్నుతో బ్రాండ్‌ను పునరుద్ధరించేందుకు అనుమతుల కోసం పౌర విమానయాన శాఖను సంప్రదించినట్లు కంపెనీ ఎండీ ఉమేశ్‌ వంకాయలపాటి తెలిపినట్లు వార్తా కథనం వెలువడింది. 

సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రం తమకు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఇక పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)లో ఎయిర్‌ ఆపరేటర్స్‌ పర్మిట్‌ను (ఏవోపీ) రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఉమేశ్‌ తెలిపారు. ఇందుకోసం సుమారు 180 రోజుల వరకుసమయం పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు.

 ప్రాథమికంగా రూ. 200 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు, 600 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు. 2015–2022 మధ్య కాలంలో ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలందించే సంస్థగా, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ట్రూజెట్‌ కార్యకలాపాలు సాగించింది. అయితే, కోవిడ్‌ అనంతర ప్రతికూల ప్రభావాలతో, ఆర్థిక సంక్షోభం తలెత్తి 2022 ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది.  

హబ్‌గా వైజాగ్‌.. 
ఏవోపీ వచ్చాక ఎయిర్‌బస్‌ ఏ320 విమానంతో నవంబర్‌ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఉమేశ్‌ చెప్పారు. వైజాగ్‌ తమకు హబ్‌గా ఉంటుందన్నారు. తొలి ఫ్లయిట్‌ విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్‌కి నడిపే అవకాశం ఉందని ఉమేశ్‌ వివరించారు. ఏ320 విమానాలతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ఉడాన్‌ స్కీము కింద సర్వీసులు నడిపేందుకు ఏటీఆర్‌ టర్బోప్రాప్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా తీసుకునే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏటీఆర్‌లకు లక్నో విమానాశ్రయం బేస్‌గా ఉంటుందన్నారు.  
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)