Breaking News

థాయ్‌లాండ్‌ వీసా నిబంధనల్లో మార్పులు

Published on Wed, 05/29/2024 - 08:50

పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా థాయ్‌లాండ్‌ ప్రభుత్వ ప్రతినిధి చాయ్ వాచరోంకే మాట్లాడుతూ..‘పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్‌ వీసా గడువు పెంచాం. దాంతోపాటు ఇతర దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్‌ వర్కర్లు, పదవీవిరమణ పొందిన వారికి సంబంధించి వీసాలో మార్పులు చేశాం. జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. గతంలో థాయ్‌లాంట్‌ వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 93కు పెంచాం. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలి. ఆన్-అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించాం. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను సడలించాం. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఒక సంవత్సరం అదనంగా ఉండవచ్చు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేకవీసాలు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి’ అని చెప్పారు.

ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదు

ఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 పూర్తి ఏడాదికిగాను రికార్డు స్థాయిలో 40 మిలియన్ల విదేశీ రాకపోకలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9లక్షల కోట్లు) దేశఖజానాకు చేరుతుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో థాయ్‌లాండ్‌కు 39.9 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)