ట్రావెల్‌ ఫుడ్‌ @ రూ. 1,045–1,100 

Published on Thu, 07/03/2025 - 05:42

న్యూఢిల్లీ: క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్ల(క్యూఎస్‌ఆర్‌)తోపాటు విమానాశ్రయాల్లో లాంజ్‌ బిజినెస్‌ నిర్వహించే ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 1,045–1,100 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 4న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్‌ కపూర్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌ రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. 

తద్వారా ఐపీవో నిధులు మొత్తం ప్రమోటర్లకు అందనున్నాయి. ప్రమోటర్‌ సంస్థ కే హాస్పిటాలిటీ బ్రాండుతో ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్‌సహా విదేశాలలోనూ పలు ఆతిథ్య సేవలు, ఫుడ్‌ సర్వీసుల బిజినెస్‌లను నిర్వహిస్తోంది. ఈ ముంబై కంపెనీ తొలుత 2009లో తొలి ట్రావెల్‌ క్యూఎస్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. కపూర్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌తోపాటు ఎస్‌ఎస్‌పీ గ్రూప్‌ పీఎల్‌సీ కంపెనీని ప్రమోట్‌ చేశాయి. 

కంపెనీ ప్రధానంగా ఎంపిక చేసిన ఆహారం, పానీయాల(ఎఫ్‌అండ్‌బీ)ను ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా విమానాశ్రయాలు, కొన్ని జాతీయ రహదారి ప్రాంతాలలో సమకూర్చుతోంది. దేశీయంగా 14 విమానాశ్రయాలలో సర్వీసులు అందిస్తోంది. మలేసియాలో 3 ఎయిర్‌పోర్టులలో లాంజ్‌ సేవలు కలి్పస్తోంది. 2024 జూన్‌కల్లా దేశ, విదేశాలలో 117 పార్ట్‌నర్, సొంత బ్రాండ్లతో కలిపి 397 ట్రావెల్‌ క్యూఎస్‌ఆర్‌ ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. వీటిలో సుప్రసిద్ధ కేఎఫ్‌సీ, పిజ్జా హట్, కాఫీ బీన్, టీ లీఫ్, సబ్‌వే, బికనీర్‌వాలా, అడయార్‌ ఆనంద్‌ భవన్, వౌ మోమో తదితర బ్రాండ్స్‌ ఉన్నాయి. 
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)