Breaking News

ఎస్‌బీఐ అకౌంట్‌ బ్రాంచ్‌ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా

Published on Thu, 05/11/2023 - 19:02

సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ  బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మీకు అకౌంట్‌ ఉందా.  ఎస్‌బీఐ  ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారా? బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్‌గా  ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. వివరాలు ఇలా.. 

ముఖ్యంగా  ఎస్‌బీఐలో ఖాతాదారు ఫోన్‌ నంబరు రిజిస్టర్‌ అయి ఉండాలి.  YONO యాప్ లేదా YONO Lite ద్వారా కూడా బ్రాంచ్‌ని మార్చుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీ బ్యాంక్ ఖాతా ఒక శాఖ నుండి మరొక శాఖకు ఎలా బదిలీ చేయాలి. ఎస్‌బీఐ అధికారిక  పెర్సనల్‌ బ్యాంకింగ్‌ వెబ్యాంకింగ్‌ విభాగంలోకి వెళ్లి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ న‌మోదు చేయాలి. తర్వాత ఈ-సర్వీస్ కేట‌గిరీని ఎంచుకోవాలి. అందులో ట్రాన్స్‌ఫర్‌ సేవింగ్స్‌ అకౌంట్‌పై ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. అన్ని వివరాలు న‌మోదు చేశాక రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్‌ సంబంధిత శాఖకు  బదిలీ అవుతుంది. యోనో యాప్‌లో కూడా దాదాపు ఇదే పద్దతిలో బ్రాంచ్‌ను మార్చుకోవచచ్చు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర)

ఎస్‌బీఐ యోనో  యాప్‌  ద్వారా అయితే
యోనో యాప్‌లో లాగిన్‌ అయ్యి  'సర్వీసెస్'ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
ఇక్కడ ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి
కొత్త బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో పాటు బదిలీ చేయాలనుకుంటున్న ఖాతావివరాలివ్వాలి. 
గెట్‌  బ్రాంచ్ నేమ్‌ క్లిక్‌ చేయాలి. 
కొత్త బ్రాంచ్ పేరు ఫ్లాష్ అవుతుంది. అది సరియైనది అని నిర్దారించుకున్నాక, సబ్మిట్‌  'సమర్పించు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)