Breaking News

రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే..

Published on Sat, 06/03/2023 - 19:02

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరినీ కలిచివేసింది. శుక్రవారం (జూన్ 2) జరిగిన ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 ప్రకటించారు. అయితే ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు కనిపించే ప్రయాణ బీమా ఆప్షన్‌ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

35 పైసలతో రూ.10 లక్షలు
రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో  రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ మనకు కనిపిస్తుంది. అయితే కొంత మంది ఈ ఆప్షన్‌ పట్టించుకోరు. కేవలం ప్రమాదాలు జరిగిప్పుడే కాకుండా ఈ బీమా ద్వారా ఇంకా ఇతర ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం ఐఆర్‌సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే తీసుకుంటుంది. రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభిస్తుంది.

అలాగే ప్రమాదం జరిగినప్పుడు చికిత్సకు అయ్యే ఖర్చులు, ఒకవేళ మరణం సంభవించినప్పుడు వారి కుటుంబానికి పరిహారం అందిస్తారు. ఏదైనా రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10,000 వరకు అందజేస్తారు.

క్లెయిమ్ చేయడమెలా?
ఐఆర్‌సీటీసీ లేదా ఇతర అధీకృత యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేస్తున్నప్పుడు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఎంచుకోవాలన్న సూచన మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎంచుకోవాలా వద్దా అన్నది పూర్తిగా ప్రయాణికుల ఇష్టం. దీన్ని ఎంచుకున్న ప్రయాణికులు లేదా వారి కుటుంబ సభ్యులు వారు ప్రయాణించిన రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు. అయితే బీమాను ఎంచుకునే సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు.

ఇదీ చదవండి ➤ Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌! పరీక్ష రాసి మరీ..

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)