Breaking News

రూ.150 కోట్లు జరిమానా కట్టండి: ట్రాయ్‌ పెనాల్టీ

Published on Tue, 01/06/2026 - 11:42

అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేయడంలో విఫలమైనందుకు గాను టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రూ. 150 కోట్ల జరిమానా విధించింది. నెలకు రూ. 50 లక్షల వరకు పెనాల్టీలతో 2020 నుంచి మూడేళ్ల వ్యవధికి గాను ఈ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది.

కస్టమర్ల ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకపోవడం, నిబంధనలకు తగ్గట్లుగా స్పామర్లపై తగిన చర్యలు తీసుకోకపోవడంలాంటి ఆరోపణలు ఇందుకు కారణం. అయితే, ఈ జరిమానాను టెల్కోలు సవాలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాయ్‌ గతేడాది 21 లక్షల స్పామ్‌ కనెక్షన్లను డిస్కనెక్ట్‌ చేయడంతో పాటు 1 లక్ష పైగా ఎంటిటీలను (సంస్థలు, వ్యక్తులు) బ్లాక్‌లిస్టులో పెట్టింది.

4–6 క్లిక్‌లతో కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు వీలుగా ట్రాయ్‌ డీఎన్‌డీ యాప్‌ అందుబాటులో ఉంది. కాల్స్‌ లేదా మెసేజీలు వచ్చిన 7 రోజుల వరకు ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, బీమా రంగాల కంపెనీలు లావాదేవీలు..సర్వీసులపరమైన కాల్స్‌ చేసేందుకు 1600 సిరీస్‌తో మొదలయ్యే నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.

10 అంకెల మొబైల్‌ నంబర్ల నుంచి ప్రమోషనల్‌ కాల్స్‌ చేయకూడదు. రిజిస్టర్డ్‌ టెలీమార్కెటర్లకు కఠినతరమైన నిబంధనలు అమలవుతున్నప్పటికీ, ఇప్పుడు రిజిస్టర్‌ చేసుకోని వ్యక్తుల.. 10 అంకెల మొబైల్‌ నంబర్ల నుంచి స్పామ్‌ కాల్స్, మెసేజీలు అత్యధికంగా వస్తున్నాయి.

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)