Breaking News

టెలికం సేవల నాణ్యత నిబంధనలు కఠినతరం

Published on Sat, 08/19/2023 - 05:05

న్యూఢిల్లీ: కాల్‌ డ్రాప్‌ ఫిర్యాదులు గణనీయంగా వస్తున్న నేపథ్యంలో సేవల నాణ్యత నిబంధనలను సమీక్షించడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ దృష్టి పెట్టింది. ప్రస్తుతం టెలికం సర్కిల్‌ స్థాయిలో చేస్తున్న నెట్‌వర్క్‌ పనితీరు సమీక్షను జిల్లా స్థాయిలోనూ నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సరీ్వసుల నాణ్యత నిబంధనల్లో కాల్‌ డ్రాప్‌ పరామితులు, కాల్‌ సక్సెస్‌ రేటు మొదలైనవి కఠినతరం చేయాలని ట్రాయ్‌ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను సెపె్టంబర్‌ 20లోగా, ముసాయిదా నిబంధనలపై అక్టోబర్‌ 5న కౌంటర్‌ కామెంట్లు దాఖలు చేయాలని ట్రాయ్‌ సూచించింది. మొబైల్‌ టెలికమ్యూనికేషన్స్‌లో సాంకేతికత ఎంతగానో పురోగమించినా వినియోగదారులకు నాణ్యమైన సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని ట్రాయ్‌ పేర్కొంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ ఉన్నా, 5జీ సేవలు విస్తరిస్తున్నా కాల్‌ డ్రాప్స్, కాల్‌ వినబడకపోవడం, డేటా వేగం తగ్గిపోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయని తెలిపింది. ఇలాంటి అంశాల వల్ల నెట్‌వర్క్‌ సామర్థ్యాలపై సందేహాలు తలెత్తుతున్నాయని వివరించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)