Breaking News

సెప్టెంబర్‌ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్‌ నిలిపివేత!

Published on Wed, 08/21/2024 - 13:23

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా కంపెనీలు మోసపూరిత మెసేజ్‌లు, కాల్స్‌ చేస్తూ టెలికాం వినియోగదారులను టార్గెట్‌ చేస్తున్నాయి. ఈ వ్యావహారంపై అవగాహనలేనివారు స్కామర్ల చేతికిచిక్కి ఆర్థికంగా, మనసికంగా బలవుతున్నారు. ఈ మోసాలను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మెసేజ్‌ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. సరైన గుర్తింపులేని సర్వీస్‌ ప్రొవైడర్ల ప్రసారాలను నిలిపేస్తామని ప్రకటించింది.

ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్‌!

అయాచిత స్పామ్‌ కాల్స్, మెసేజ్‌ల కట్టడికి ట్రాయ్‌ గత కొద్ది కాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌లు, కాల్స్‌ చేస్తున్నవారి సమాచారం తెలియని యూఆర్‌ఎల్‌లు, ఓటీటీ లింక్‌లను లేదా కాల్‌ బ్యాక్‌ నంబర్‌లను సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి నిలిపేస్తున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. ఆయా విభాగాల్లోని సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రసారాలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం పంపినవారి నుంచి మెసేజ్‌ గ్రహీతల వరకు  అన్నింటినీ ట్రేస్‌ (గుర్తించడానికి) చేయడానికి నవంబర్‌ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌ నిర్దేశించింది. పారదర్శకతలేని టెలిమార్కెటర్‌ చైన్‌ నుంచి వచ్చే సందేశాల ప్రసారం నిలిపివేతకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

#

Tags : 1

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)